మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
కరీంనగర్, జులై 11 ( చైతన్యగళం ): పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ శనివారం కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసుల నిర్వహణ, బాధితులకు అందిస్తున్న సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు.పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడిన పోలీస్ కమిషనర్, రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగానిర్వహించాలనిసూచించారు. మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర, నాణ్యమైన సేవలు అందిస్తూ, సానుభూతితో వ్యవహరించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సమీక్షించిన ఆయన, వాటి ఆలస్యానికి గల కారణాలను...