జిల్లాస్థాయి ఇన్-సర్వీస్ శిక్షణ తొలి స్పెల్ ముగింపు కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ స్నేహ శబరిష్
మహబూబాబాద్(చైతన్యగళం): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. పట్టణంలోని అనంతారం టీఎస్ మోడల్ స్కూల్‌లో నిర్వహిస్తున్న "ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ క్వాలిటీ లెర్నింగ్ త్రూ ట్రాన్స్‌ఫార్మేటివ్ క్లాస్‌రూమ్ ప్రాక్టీసెస్" జిల్లాస్థాయి ఇన్-సర్వీస్ శిక్షణ తొలి స్పెల్ ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, తరగతి గదిలో ఆంగ్ల మాధ్యమ బోధనను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర...