ప్రత్యేక ఓటరు జాబితా సవరణను పారదర్శకంగా నిర్వహించాలి-కలెక్టర్ హైమావతి

సిద్దిపేట, జూలై 11{చైతన్యగళం}: జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. శనివారం అక్బర్‌పేట భూంపల్లి మండలం మోతే గ్రామంతో పాటు జిల్లా కేంద్రంలోని కాళ్లకుంట్ల కాలనీ, శివాజీ నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎన్‌మరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తైందని, బీఎల్‌వోల వారీగా ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ...