ఎలిగేడులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ఎలిగేడు, జూలై 12 (చైతన్య గళం): ఎలిగేడు మండల కేంద్రంలోని అయిదవ వార్డులో ఆదివారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ కప్పల ప్రవీణ్, ఉప సర్పంచ్ ముంజం నరేష్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గ్రామానికి ఈజీఎస్ నిధుల ద్వారా రూ.20 లక్షలు కేటాయించారని, గ్రామాభివృద్ధికి సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు ముంజంపల్లి కవిత రాకేష్, మాజీ సర్పంచ్ మండిగ రాజనర్సయ్య, మాజీ ఎంపీటీసీ బూర్ల సత్యనారాయణ, మాజీ ఉపసర్పంచ్ కోరుకంటి వెంకటేశ్వరరావు,...