CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 2:48 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఎలిగేడులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ఎలిగేడు, జూలై 12 (చైతన్య గళం):
ఎలిగేడు మండల కేంద్రంలోని అయిదవ వార్డులో ఆదివారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ కప్పల ప్రవీణ్, ఉప సర్పంచ్ ముంజం నరేష్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గ్రామానికి ఈజీఎస్ నిధుల ద్వారా రూ.20 లక్షలు కేటాయించారని, గ్రామాభివృద్ధికి సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు ముంజంపల్లి కవిత రాకేష్, మాజీ సర్పంచ్ మండిగ రాజనర్సయ్య, మాజీ ఎంపీటీసీ బూర్ల సత్యనారాయణ, మాజీ ఉపసర్పంచ్ కోరుకంటి వెంకటేశ్వరరావు, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ తాటిపల్లి రమేష్ బాబు, వార్డు సభ్యులు మడుపు నరేందర్, న్యాతరి పోచాలు, కవ్వంపల్లి సాయి ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు చింతకుంట మనోహర్, అమ్ముల రమేష్ యాదవ్, రంగు శ్రీనివాస్ గౌడ్, ముంజం మల్లయ్య, అడ్డగుంట శ్రీనివాస్ గౌడ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.