CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 2:35 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు

ఎల్కతుర్తి, జూలై 12(చైతన్యగళం):

ఎల్కతుర్తి మండల కేంద్రంలో కేంద్ర హోం సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ.. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బండి సంజయ్ కుమార్ తన అంకితభావం, నిబద్ధత, ప్రజా పోరాటాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతూ కేంద్ర హోం సహాయ మంత్రిగా ఎదగడం ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను  అర్హులందరికీ   చేరవేయడానికి కృషి చేస్తామని తెలిపారు.

జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి కార్యకర్తలు, ప్రజలకు అరటిపండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సుమారు 50 మందికి పైగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు, మండల, జిల్లా బాధ్యులు పాల్గొని బండి సంజయ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.