జిల్లా బీజేపీ సమావేశంలో కీలక తీర్మానాలు
కరీంనగర్ (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా బీజేపీ విస్తృత స్థాయి సమావేశం గంగాధర మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ముఖ్య అతిథి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి శాంతి కుమార్ మాట్లాడుతూ – కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజలను మోసం చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడంలో విఫలమైందని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపుతోందని బీజేపీ నాయకులు మండిపడ్డారు....