హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ

హుజురాబాద్, జూలై 10 (చైతన్య గళం):  పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుద్ధ్య సమస్యలు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, తాగునీటి సరఫరా, మురుగు కాలువల నిర్వహణ, చెత్త సేకరణ, ప్రధాన చౌరస్తాల పరిశుభ్రత వంటి అంశాలపై అధికారులను నిలదీస్తూ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల నుంచి నిరంతరం ఫిర్యాదులు వస్తున్నప్పటికీ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు....