స్వగ్రామంలో గృహ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకర్ భూమిపూజ

షాద్‌నగర్, జూలై 10 (చైతన్యగళం): నందిగామ మండలం వీర్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ శుక్రవారం తన నూతన గృహ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్, ఆయన సతీమణి అనురాధ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ పెద్దలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. తన స్వగ్రామంలోనే గృహాన్ని నిర్మించుకోవడం ద్వారా గ్రామంపై తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారని స్థానికులు పేర్కొన్నారు. గ్రామ పెద్దలు, అభిమానులు ఎమ్మెల్యే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.