చల్లూరు పిహెచ్‌సీలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆకస్మిక తనిఖీ

హుజూరాబాద్, జూలై 10 (చైతన్య గళం): వీణవంక మండలం చల్లూరు గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు సకాలంలో అందడం లేదని, సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రిలో 12 మంది సిబ్బంది మంజూరై ఉన్నప్పటికీ, వారిలో 6 మంది డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారని, ప్రస్తుతం...