మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి, జూలై 10 (చైతన్యగళం): ధర్మపురి పట్టణంలోని ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా బిజెపి నాయకుడు పోగుల గుండయ్య మృతి చెందగా, ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తక్షణ ఆర్థిక సహాయంగా ₹10,000 అందజేశారు.