ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపిన సహకార సంఘం సభ్యులు

జగిత్యాల, జూలై 10 (చైతన్యగళం): జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మొక్కజొన్న రైతుల వినతి మేరకు సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను గ్రామ సహకార సంఘం సభ్యులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. రైతుల సమస్యలకు తక్షణ స్పందనతో అండగా నిలిచిన ఆయన కృషి వల్ల రికార్డు స్థాయిలో మొక్కజొన్న పంట కొనుగోలు జరిగి, రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడం రైతులకు ఊరటనిచ్చిందని సభ్యులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ...