విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వ బాధ్యత – ఎమ్మెల్యే కౌశిక్

వీణవంక, జూలై 10 (చైతన్యగళం): వీణవంక మండలం చల్లూర్ గ్రామంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాల, అంగనవాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల హాజరు, బోధన విధానం, తరగతి గదుల నిర్వహణ, మధ్యాహ్న భోజనం నాణ్యత, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య పరిస్థితులు, మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు, పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంగనవాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న పోషకాహారం,...