CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 12:59 pm Posted by : CHAITHANYA GALAM NEWS

కాళేశ్వరం విషయంలో డ్రామాలు ఆడొద్దని ఈటల హెచ్చరిక

హైదరాబాద్, జూలై 10 (చైతన్యగళం): కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ – “నేడు ఒకరు ఆడించినట్టు ఆడే వ్యక్తిని కాదు. నాకు తెలంగాణ ఫస్ట్.. తర్వాతే పార్టీ.. ఆ తర్వాతే వ్యక్తిగతం” అని స్పష్టం చేశారు.

రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరిస్తూ, ఉత్తర తెలంగాణకు నీళ్ల జంక్షన్ మిడ్ మానేరు అని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ పనులు చేపట్టకుండా ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు.

కరవు వస్తుందని తెలిసీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డ ఆయన, లోలెవల్ పాయింట్‌కు వచ్చే నీటిని ఎత్తిపోసే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వరుస ప్రశ్నలు సంధించారు.