CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 12:14 pm Posted by : CHAITHANYA GALAM NEWS

విద్యుత్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

కరీంనగర్, జూలై 10 (చైతన్యగళం): కరీంనగర్ మీటింగ్ హాల్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో విద్యుత్ ఉద్యోగుల కుటుంబ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.

ఈ సందర్భంగా చైర్మన్‌గా జంపాల రాజం (డిఈ, ఓపెన్ టౌన్, కరీంనగర్), ఉపాధ్యక్షులుగా కామ తిరుపతి (ఎల్‌ఎమ్‌ఓపీ, టౌన్–3, కరీంనగర్), ప్రధాన కార్యదర్శిగా కంజర్ల మహదేవ్ (ఎల్‌ఐఓపీ, టౌన్, కరీంనగర్), కోశాధికారిగా కొండ వేణుగోపాల్ (జేఆర్ అసిస్టెంట్, డిఓపెన్ రూరల్, కరీంనగర్), సహాయ కార్యదర్శిగా లౌడ్య నౌసిలాల్ (ఎల్‌ఎమ్‌ఓపీ, గుండి) ఎన్నికయ్యారు.

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యవర్గ సభ్యులకు సంఘం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలిపారు.