హుస్నాబాద్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల భవనాలకు భూమిపూజ

పాల్గొన్న మంత్రులు మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వివేక్ వెంకటస్వామి హుస్నాబాద్ , జూలై 10 (చైతన్యగళం): హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామంలో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల శాశ్వత భవనాల నిర్మాణానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, హుస్నాబాద్...