కరీంనగర్ అభివృద్ధికి స్మార్ట్ సిటీ నిధులు – మేయర్ కృతజ్ఞతలు

కరీంనగర్, జూలై 8 (చైతన్యగళం): కరీంనగర్ నగరాన్ని ఆధునిక, సుందర, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్మార్ట్ సిటీ ప్రత్యేక నిధుల కింద రూ.70 కోట్లతో పలు ప్రతిష్ఠాత్మక అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రకటించారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధికి విశేష కృషి చేసి నిధులు మంజూరు చేయించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కు నగర ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. నగర...