సీఎం సభలో అస్వస్థతతో మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడి కుటుంబానికి రూ.5 లక్షల సాయం

గట్టు ఇప్పలపల్లిలో ఏదుల శంకర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు పొంగులేటి, వాకిటి – ఎమ్మెల్యే కసిరెడ్డి ఆమనగల్లు, జూలై 8 (చైతన్యగళం): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో అస్వస్థతకు గురై మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఏదుల శంకర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన శంకర్ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ నెల 4న...