ఎన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికే అమరావతి పూర్తి: మంత్రి నారాయణ

అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లే అవుట్ పనుల పురోగతిపై చర్చించారు. అమరావతి, జులై 8(చైతన్యగళం): అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ ఈరోజు(బుధవారం) సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లే అవుట్ పనుల పురోగతిపై చర్చించారు. ప్రాజెక్టుల వారీగా పనులు ఎంత మేరకు పూర్తయ్యాయనే దానిపై కాంట్రాక్ట్ సంస్థలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం...