ఫ్యూచర్ సిటీ రహదారి భూసేకరణకు మేడిపల్లి గ్రామస్తుల సమ్మతి
యాచారం, జూలై 08 (చైతన్యగళం): ఫ్యూచర్ సిటీకి అనుసంధానంగా నిర్మించనున్న రహదారికి అవసరమైన భూసేకరణ ప్రక్రియలో భాగంగా మేడిపల్లి గ్రామస్తులు ప్రభుత్వానికి తమ సమ్మతి తెలిపారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి ఛాంబర్‌లో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భూసేకరణ ప్రక్రియ, పరిహారం చెల్లింపు, ప్రభుత్వ నిబంధనలు, రైతులకు కల్పించబడుతున్న ప్రయోజనాలపై సమగ్రంగా వివరించారు. అనంతరం గ్రామస్తులతో జరిగిన చర్చలు సానుకూల వాతావరణంలో సాగాయి. ప్రభుత్వం ప్రకటించిన పరిహారంపై గ్రామస్తులు అంగీకారం వ్యక్తం చేస్తూ...