భూ సేకరణ పనులు వేగవంతం చేయాలి-ఆర్&ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు
కరీంనగర్, జూలై 8(చైతన్యగళం): జిల్లాలో వివిధ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్అండ్ఆర్ (రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్) భూ సేకరణ కమిషనర్ కే. శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో రెవెన్యూ, ఇరిగేషన్, భూ సేకరణ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో భూ సేకరణ పురోగతిని సమీక్షించారు. శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు, గౌరవెల్లి రిజర్వాయర్ కాలువలు, కాకతీయ కాలువ, కాలేశ్వరం ప్రాజెక్టు, కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే...