ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి
సిద్దిపేట, జూలై 8 (చైతన్యగళం): జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్ అండ్ ఆర్ కమిషనర్ కే. శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతితో కలిసి దేవాదుల, గౌరవెల్లి, మల్లన్నసాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, పునరావాస సమస్యలను జిల్లా కలెక్టర్ కమిషనర్‌కు వివరించారు. దేవాదుల ప్రాజెక్టు పరిధిలో చేర్యాల,...