కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జన్మదిన వేడుకలు

కమలాపూర్ (చైతన్యగళం): కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఝాన్సీ రాణి మాట్లాడుతూ, “నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రణవ్ బాబు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ బలగం ఆశీస్సులతో జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది” అని తెలిపారు. ఈ వేడుకల్లో డైరెక్టర్లు సముద్రాల కృష్ణ, జనగాని శివకృష్ణ,...