CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 11:21 am Posted by : CHAITHANYA GALAM NEWS

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు విద్యుత్ కనెక్షన్లు

సుల్తానాబాద్, (చైతన్యగళం): సుల్తానాబాద్ పట్టణంలోని తొమ్మిదవ వార్డు శ్రీరామ్ నగర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కొత్త విద్యుత్ కనెక్షన్లు, కరెంటు స్తంభాలు కావాలని అర్జీ పెట్టడంతో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు సహకారంతో సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు.

మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ సహకారంతో 15వ ఆర్థిక సంఘం నిధులనుండి స్తంభాలు కొనుగోలు చేసి, మున్సిపల్ చైర్మన్ బిరుదురాధాకృష్ణ దగ్గరుండి విద్యుత్ శాఖ AE కిషోర్తో మాట్లాడి పనులు చేయించారు. తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ తొర్రికొండ ప్రభాకర్ పర్యవేక్షణలో ఇందిరమ్మ ఇళ్లకు కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూర్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేష్, కౌన్సిలర్ ఈర్ల శేఖర్, విద్యుత్ శాఖ AE కిషోర్, మున్సిపల్ AE రాజ్ కుమార్, కాంట్రాక్టర్ కోటి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, సిబ్బంది పాల్గొన్నారు.