శాతవాహనలో సాంప్రదాయ వైద్యంలో కృత్రిమ మేధస్సు పాత్రపై సదస్సు
కరీంనగర్, జూలై 08 (చైతన్యగళం): శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సహజ సిద్ధ ఔషధాల ఆవిష్కరణలో కృత్రిమ మేధస్సు పాత్ర అనే అంశంపై ఒకరోజు సదస్సు ఘనంగా జరిగింది. ఉపకులపతి ఆచార్య యు. ఉమేశ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ – భారతదేశపు ప్రాచీన సాంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికత అయిన కృత్రిమ మేధస్సుతో అనుసంధానించడం ద్వారా మానవాళికి ఉపయోగపడే సురక్షితమైన కొత్త ఔషధాలను కనుగొనవచ్చని అన్నారు. పరిశోధనల్లో విద్యార్థులు ఇలాంటి నూతన సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని...