జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు రాష్ట్ర స్థాయికి విజేతల ఎంపిక

కరీంనగర్, జూలై 8(చైతన్యగళం): జోన్-III పరిధిలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల పోలీసు సిబ్బంది కోసం నిర్వహించిన జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ విజయవంతంగా ముగిసింది. పోలీసు సిబ్బంది వృత్తిపరమైన నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, దర్యాప్తు సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ పోటీల్లో ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఫింగర్ ప్రింట్స్, సైబర్ అవగాహన, క్రైమ్ సీన్ ఫోటోగ్రఫీ, సెర్చ్ ఆపరేషన్స్ తదితర 21 విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు. వివిధ విభాగాల్లో కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల,...