చల్లూరులో మహిళపై దాడి – నిందితుడి అరెస్ట్

హుజురాబాద్, జూలై 8 (చైతన్యగళం): వీణవంకలో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి, ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 6న చల్లూరు గ్రామానికి చెందిన వేముల పద్మ (45) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒక వ్యక్తి దొంగతనం ఉద్దేశంతో చొరబడి, ఆమెను బలవంతంగా పట్టుకుని బంగారు తాడును గుంజేందుకు ప్రయత్నించాడు. ప్రతిఘటించిన బాధితురాలిపై దాడి చేసి గాయపరిచాడు. ఆమె కేకలు విని కుమార్తె శాముల నవ్యశ్రీ (24), మరిది శాముల సంపత్ (38)...