అక్రమ ఇసుక రవాణాపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల వరుస చర్యలు

కరీంనగర్, జూలై 8 (చైతన్యగళం): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక రవాణా, నిల్వలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో పలు ప్రాంతాల్లో అక్రమ ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామం పరిసరాల్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన మూడు ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పట్టుకుని, కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. మానేరు వాగులో కోతిరాంపూర్‌కు చెందిన ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.   నెడునూరు గ్రామ పరిధిలో...