వెల్దండ, జూలై 7 (చైతన్యగళం): వెల్దండ మండల కేంద్రంలో మండల ఎమ్మార్వో కార్తీక్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక జర్నలిస్టులు ఆయనను ఘనంగా సన్మానించారు. మండల కార్యాలయంలో జర్నలిస్టులు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మార్వో కార్తీక్ కుమార్ మాట్లాడుతూ, “మండల కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటిని త్వరితగతిన పరిష్కరించడం నా బాధ్యత. నా ఉద్యోగ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తాను” అని స్పష్టం చేశారు.
సన్మానం చేసిన జర్నలిస్టులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.