CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 8:20 pm Posted by : CHAITHANYA GALAM NEWS

గన్‌మెన్లను వెనక్కి పంపిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, జూలై 7 (చైతన్యగళం): ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం భద్రత దృష్ట్యా ఏర్పాటు చేసిన గన్‌మెన్లను మరోసారి వెనక్కి పంపించారు.ఆయన మాట్లాడుతూ, “నాకు అదనపు భద్రత అవసరం లేదు. ప్రజా ప్రతినిధిగా నాకు ప్రజల ప్రేమాభిమానాలు, విశ్వాసమే నిజమైన భద్రత. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడం నా బాధ్యత” అని స్పష్టం చేశారు.ప్రజలతో నిత్యం మమేకమై అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు ప్రశంసిస్తూ, “నిజమైన ప్రజానాయకుడు మన బండారి లక్ష్మారెడ్డి” అని కొనియాడారు.