వాయనాడ్‌లో విలయం-విరిగిపడిన కొండచరియలు

కేరళ(చైతన్యగళం): కేరళలోని పర్వత ప్రాంత జిల్లా వాయనాడ్‌ను కుండపోత వర్షాలు ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగళవారం తెల్లవారుజామున మేప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. వాయనాడ్ – మలప్పురం టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు పనులు జరుగుతున్న మీనాక్షి బ్రిడ్జ్ పరిసరాల్లో ఒక్కసారిగా భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తు సమయంలో అక్కడ నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్న కార్మికులు బస చేసిన తాత్కాలిక నివాసాలపై కొండశిథిలాలు, మట్టి ముద్దలు ఒక్కసారిగా...