నల్లగొండ లో మహిళల కోసం మెగా జాబ్ డ్రైవ్

నల్లగొండ, జూలై 07 (చైతన్యగళం): మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు లాక్ష్ జాబ్ స్కిల్స్ అకాడమీ మరియు లాక్ష్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ డ్రైవ్ జూలై 8, 2026 (బుధవారం) జరగనుంది. ఈ ఉద్యోగ మేళాలో 10 కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని అర్హత కలిగిన మహిళా అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్, సన్సాయి గ్రూప్, డిజిటైడ్, ఐసీఐసీఐ బ్యాంక్, పవాన్, ష్నైడర్ ఎలక్ట్రిక్...