ప్రజల వద్దకే పాలన..
12వ వార్డులో ఈవినింగ్ వాక్ నిర్వహించిన చైర్మన్ పత్యనాయక్ ఆమనగల్లు, జూలై 7 (చైతన్యగళం): ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ పత్యనాయక్ మంగళవారం మున్సిపాలిటీ 12వ వార్డులో ఈవినింగ్ వాక్ నిర్వహించారు. వార్డు వీధుల్లో పర్యటిస్తూ స్థానికులతో మాట్లాడిన ఆయన తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సూచించిన సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు....