CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 8:24 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రజల వద్దకే పాలన..

  • 12వ వార్డులో ఈవినింగ్ వాక్ నిర్వహించిన చైర్మన్ పత్యనాయక్

ఆమనగల్లు, జూలై 7 (చైతన్యగళం): ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ పత్యనాయక్ మంగళవారం మున్సిపాలిటీ 12వ వార్డులో ఈవినింగ్ వాక్ నిర్వహించారు. వార్డు వీధుల్లో పర్యటిస్తూ స్థానికులతో మాట్లాడిన ఆయన తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సూచించిన సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని చైర్మన్ పత్యనాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ నాగిళ్ల జగన్, మున్సిపల్ మేనేజర్ ఆంజనేయులు, మున్సిపాలిటీ సిబ్బంది, నాయకులు కుమార్ గౌడ్, మహేష్‌తో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.