దిశ కమిటీ సమావేశంలో అభివృద్ధి పథకాలపై దిశానిర్దేశం

మహబూబాబాద్, జూలై 7 (చైతన్యగళం): జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన దిశ కమిటీ సమావేశానికి పార్లమెంటు సభ్యుడు, కమిటీ చైర్మన్ పోరిక బలరాం నాయక్ అధ్యక్షత వహించారు. ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వ్యవసాయం, వైద్యం, గృహనిర్మాణం, విద్య,...