ఎఫ్‌సిఐని అదానీ గ్రూప్‌కు అప్పగించడాన్ని నిలిపివేయాలని సీఐటీయూ డిమాండ్
నల్లగొండ, జూలై 7 (చైతన్యగళం): భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) సైలో పథకాన్ని అదానీ గ్రూప్‌కు అప్పగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి సలీం, జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. నల్లగొండలోని సుందరయ్య భవన్లో మంగళవారం జరిగిన ఎఫ్‌సిఐ హమాలి వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) విస్తృత సమావేశంలో వారు మాట్లాడుతూ, “దేశ ఆహార భద్రతా మౌలిక సదుపాయాలను కార్పొరేటీకరించడానికి జరుగుతున్న ప్రమాదకరమైన ప్రయత్నం ఇది” అని విమర్శించారు. వారి వివరాల ప్రకారం, మొత్తం 134 సైలో కాంట్రాక్టుల్లో 110 కాంట్రాక్టులు...