గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన

షీ టీం–భరోసా–ఏహెచ్‌టీయూ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం మహబూబాబాద్, జూలై 7 (చైతన్యగళం): చిన్నారుల భద్రతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో షీ టీం, భరోసా సెంటర్, ఏహెచ్‌టీయూ (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ పి. శబరీష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి షీ టీం ఎస్‌ఐ కుమారి సునంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా...