ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి
కరీంనగర్, జూలై 6 (చైతన్యగళం): ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా క్యాంపు కార్యాలయం నుంచి సమావేశంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్యుమరేషన్...