గుప్తనిధుల తవ్వకాల కలకలం..!
నల్లమల అటవీ ప్రాంతంలో భారీ తవ్వకాల ఆనవాళ్లు గబ్బు చెలిమా వద్ద క్షుద్రపూజలు జరిగినట్లు ప్రచారం అటవీశాఖ పర్యవేక్షణపై స్థానికుల అనుమానాలు నంద్యాల, జూలై 6(చైతన్యగళం): నల్లమల అటవీ ప్రాంతంలో మరోసారి గుప్తనిధుల వేట కలకలం రేపుతోంది. మహానంది నుంచి కృష్ణనంది వైపు వెళ్లే పాత అటవీ మార్గంలోని గబ్బు చెలిమా ప్రాంతంలో భారీ స్థాయిలో తవ్వకాలు జరిగిన ఆనవాళ్లు వెలుగుచూడడంతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. సంఘటనా స్థలంలో పెద్ద ఎత్తున గుంతలు తవ్విన గుర్తులు కనిపిస్తుండగా, కొందరు క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు...