ఎంపీలకు పార్లమెంట్ ప్రశ్నల సమాధానాలపై ఆంక్షలు

న్యూఢిల్లీ, జూలై 06(చైతన్యగళం): పార్లమెంట్ సభ్యులకు లోక్‌సభ సెక్రటేరియట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సభలో తాము అడిగే ప్రశ్నలు, వాటికి ప్రభుత్వం ఇచ్చే సమాధానాల విషయంలో కఠినమైన నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. సభలో అధికారికంగా సమర్పించకముందే ఆయా ప్రశ్నల తాలూకు సమాధానాలను ముందస్తుగా మీడియాకు గానీ, ఇతర బయటి వ్యక్తులకు గానీ వెల్లడించకూడదని గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ ఈ మేరకు ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం సభలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తిగా ముగిసే వరకు సభ్యులు...