లండన్ హైకోర్టులో నీరవ్ మోదీకి చుక్కెదురు.. భారత్‌కు అప్పగింతకు మార్గం సుగమం!

లండన్, జూలై 06(చైతన్యగళం): పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)ను వేల కోట్ల రూపాయలకు ముంచేసి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు రప్పించేందుకు ఉన్న చివరి లీగల్ అడ్డంకి కూడా తొలగిపోయింది. బ్రిటన్ నుంచి తనను భారత్‌కు అప్పగించడాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన ఆఖరి అప్పీలును యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ECHR) తోసిపుచ్చింది. దీంతో నీరవ్ మోదీ దేశ బహిష్కరణకు (Extradition) లండన్ న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. మానసిక స్థితి వాదనలు తోసిపుచ్చిన...