జెడ్పీహెచ్‌ఎస్‌కు వెంటనే నూతన భవనాలు మంజూరు చేయాలి
మర్రిగూడ, జూలై 6 (చైతన్యగళం): మర్రిగూడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ (జెడ్పీహెచ్‌ఎస్)లో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరత విద్యార్థుల విద్యాభ్యాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని, వెంటనే నూతన పాఠశాల భవనాలు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలను సమగ్రంగా పరిశీలించి, విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలను గుర్తించారు. తరగతి గదులు లేక వర్షాకాలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యూనిఫారాలు అందకపోవడం ప్రభుత్వ...