ఆన్‌లైన్ స్టోర్ నిర్లక్ష్యం.. చిన్నారుల నోట్లోకి ‘గడువు ముగిసిన’ కూల్‌డ్రింక్!

కరీంనగర్,జూలై 6(చైతన్యగళం): ఆన్‌లైన్ సేవల పేరిట ప్రముఖ సంస్థలు వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. నిత్యావసరాలు, ఆహార పదార్థాల డెలివరీలో కనీస ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా కరీంనగర్ నగరంలోని గాంధీ రోడ్‌లో గల ఫ్లిప్కార్ట్ ఆన్‌లైన్ స్టోర్ యాప్ ద్వారా ఓ వినియోగదారుడికి తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. అప్పటికే గడువు ముగిసిన పానీయాన్ని డెలివరీ చేయడమే కాకుండా, దాన్ని చిన్నారులు తాగడంతో సదరు కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. స్థానిక గాంధీ రోడ్ ప్రాంతానికి చెందిన ఓ వినియోగదారుడు సోమవారం మధ్యాహ్నం...