ఘనంగా ప్రపంచ జూనోటిక్ వ్యాధుల దినోత్సవం

రంగారెడ్డి, జూలై 6 (చైతన్యగళం): ప్రపంచ జూనోటిక్ వ్యాధుల దినోత్సవం (World Zoonoses Day) సందర్భంగా సోమవారం రంగారెడ్డి జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. స్వర్ణకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, “వన్ హెల్త్ (One Health) విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా జూనోటిక్ వ్యాధులను నివారించవచ్చు” అని తెలిపారు. వైద్య, పశుసంవర్ధక, అటవీ, పర్యావరణ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తే ప్రజారోగ్యం మరింత...