ఘనంగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి
రాజన్న సిరిసిల్ల, జూలై 6 (చైతన్య గళం): భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, గొప్ప జాతీయవాది డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ “ఏక్ దేశ్ మే దో నిశాన్, దో ప్రధాన్, దో విధాన్ నహీ చలేగా” అనే నినాదం దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేస్తుందని...