రాజన్న సిరిసిల్ల, జూలై 6 (చైతన్య గళం): భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, గొప్ప జాతీయవాది డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ “ఏక్ దేశ్ మే దో నిశాన్, దో ప్రధాన్, దో విధాన్ నహీ చలేగా” అనే నినాదం దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసి దేశ సమగ్రతను కాపాడాలనే సంకల్పంతో ఉద్యమించిన మహనీయుడని కొనియాడారు.ముఖర్జీ ఆశయాలను బీజేపీ ఎల్లప్పుడూ ముందుకు తీసుకెళ్తూ దేశ సమైక్యత, సమగ్రత కోసం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు ఎర్రం వెంకటరాజన్, కొండ నరేష్, మెరుగు శ్రీనివాస్, ఉరవగొండ రాజు, మామిడాల మహేష్, పట్టణ ఉపాధ్యక్షులు శ్రీ మోర శ్రీహరి, పట్టణ అధికార ప్రతినిధి మోర రవి, పట్టణ కార్యదర్శులు సూరం వినయ్, దూడం సురేష్, గాలి శ్రీనివాస్, కనుకయ్య, సిద్ది దేవరాజు, గొట్టే భాను మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.