జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట-మంత్రి వివేక్ వెంకటస్వామి
సిద్దిపేట, జూలై 6 (చైతన్యగళం ): జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం సిద్దిపేట ఐడీఓసీలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ కె. హైమావతితో కలిసి జిల్లాలోని జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందజేస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో...