జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం విజయవంతం చేయాలి – కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్, జూలై 6 (చైతన్యగళం ): జిల్లాలో ఈ నెల 13న నిర్వహించే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. 1 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు వేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మాత్రల పంపిణీని పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాహార లోపం,...