అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం

అయోధ్య(చైతన్యగళం): దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల సొమ్మును కొందరు సిబ్బంది పక్కదారి పట్టించిన ఉదంతంపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’‌కు సంబంధించిన గత ఐదేళ్ల నాటి ఆర్థిక లావాదేవీల ఖాతాలపై సమగ్రంగా రీ-ఆడిట్‌ నిర్వహించాలని సిట్‌ నిర్ణయించింది. ఆలయ నిర్మాణ వ్యయంతో పాటు...