జగిత్యాలలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సుడిగాలి పర్యటన

జగిత్యాల, జూలై 4 (చైతన్య గళం): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం జగిత్యాల జిల్లాలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు బీజేపీ కార్యకర్తకు ఆర్థిక సాయం అందించి, ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన పలువురు పార్టీ నాయకులను పరామర్శించారు. ఉదయం మేడిపల్లి మండల కేంద్రానికి చేరుకున్న కేంద్ర మంత్రి, మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం భీమారం మండల కేంద్రంలో ఎంపీ లాడ్స్ నిధులతో...